Babanipur | తృణమూల్‌కే కోల్‌కతా పోలీసుల మద్దతు.. బీజేపీ ఆరోపణ
Babanipur | తన ప్రచారంపై పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు సమాచారం ఇస్తున్నారని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు.

Babanipur | తన కదలికలను కోల్‌కతా పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నారని భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె తరఫు ఎన్నికల ఏజెంట్ గురువారం భవానీపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. కొంత మంది కోల్‌కతా పోలీసులు సివిల్ డ్రస్‌ల్లో తమ ప్రచారంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు తన కదలికలను ఫొటోలు తీసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి పంపుతున్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారంలో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించడం లేదని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు మమతా బెనర్జీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తన ఎన్నికల అఫిడవిట్లో సమాచారం దాచిపెట్టారని ఇంతకుముందు దాఖలు చేసిన ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది.
ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీస్ జారీ చేసింది. నామినేషన్ దాఖలు సమయంలో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి భారీగా మద్దతుదారులను సమీకరించారన్న అభియోగంపై ఆమెకు నోటీసులిచ్చింది. టిబ్రేవాల్ కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి, ఎటువంటి అనుమతి లేకుండా 500 మందికి పైగా సమీకరించిందని టీఎంసీ ఆరోపణ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

