హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో.. మహిళా రోగికి లైంగిక వేధింపులు
గురువారం ఉదయం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తులో ఉన్న ఆ మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు.
కోల్కతా: ప్రముఖ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో మహిళా రోగి పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. 39 ఏళ్ల మహిళ పిత్తాశయ శస్త్రచికిత్స కోసం కోల్కతాలోని ప్రసిద్ధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. గురువారం ఉదయం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తులో ఉన్న ఆ మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె ఛాతి, ప్రైవేట్ భాగాలను చేతితో తడమడంతోపాటు గట్టిగా నొక్కాడు. అనస్థీషియా వల్ల పాక్షిక స్పృహలో ఉన్న ఆ మహిళ ఆ వ్యక్తి చర్యలను అడ్డుకోలేకపోయింది. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్లో మహిళా సిబ్బంది ఎవరూ లేరని ఆమె తెలిపింది. ఈ సంఘటనపై ఫూల్బగన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కాగా, మహిళా రోగి ఫిర్యాదుపై శుక్రవారం కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఈ ఆరోపణలపై ఆ ప్రైవేట్ ఆసుపత్రి ఇంత వరకు స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

