BJP Minister Kirit Somaiya | ముంబై, జూలై 18: మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆయన అర్ధనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతుండటం అందులో ఉన్నది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. సోమయ్యతో పాటు షిండే-బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
ఈ వీడియో వారి క్యారెక్టర్, నిజమైన రూపాన్ని చూపిందని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సోమయ్య అనేక మంది మహిళలను బ్లాక్మెయిల్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్ ఆరోపించారు.