Haridwar | తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా నరికిన 15 ఏండ్ల బాలిక
తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో పదో తరగతి చదువుతున్న 15 ఏండ్ల బాలిక తండ్రి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్యచేసింది. అనంతరం వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టింది.
- ఫ్రిజ్‌లో దాచిన 15 ఏండ్ల బాలిక.. ప్రేమ కోసం ఘాతుకం
- రెండున్నర నెలల తర్వాత అరెస్ ్ట చేసిన పోలీసులు
Haridwar | హరిద్వార్, మే 30: తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో పదో తరగతి చదువుతున్న 15 ఏండ్ల బాలిక తండ్రి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్యచేసింది. అనంతరం వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘాతుకానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆ బాలికను రెండున్నర నెలల తర్వాత పోలీసులు హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో చోటు చేసుకుంది. రైల్వేలో క్లర్క్‌గా పనిచేసే రాజ్‌కుమార్ విశ్వకర్మ కుమార్తె అయిన ఈ బాలిక ముకుల్ సింగ్ (19) అనే యువకుడితో ప్రేమలో పడి గత ఏడాది అతనిలో వెళ్లిపోయింది.
దీంతో అతడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ప్రేమ ఫలించాలంటే తన తండ్రిని అడ్డు తొలగించుకోవడం ఒక్కటే మార్గమని ఆ బాలిక నిర్ణయించుకుంది. దీంతో ఇద్దరూ హత్యకు పథకం వేశారు. అనుకున్నట్టుగానే బ్లేడ్‌తో కోసి రాజ్‌కుమార్‌ను హత్య చేశారు. అదే సమయంలో నిద్రలోంచి లేచిన తొమ్మిదేళ్ల బాలిక సోదరుడిని సుత్తితో మోదీ హతమార్చారు. తర్వాత మృతదేహాలను ముక్కలుముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి పరారయ్యారు. కాగా, బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

