దేశమంతా చలి చంపేస్తుంటే.. అక్కడేమో ఎండలు దంచి కొడుతున్నయ్..!
Hottest place in Winter | దేశవ్యాప్తంగా చలి చంపేస్తున్నది. హిమాలయాలకు సమీపంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తున్నది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చలి చంపేస్తున్నది. హిమాలయాలకు సమీపంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తున్నది. ఎముకలు కొరికే చలితో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. ఎక్కడ 22, 23 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంలేదు. కానీ దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని కొట్టాయం సిటీలో మాత్రం వాతావరణం పూర్తి భిన్నంగా ఉన్నది. అక్కడ భానుడు భగ్గుమంటున్నాడు. దాంతో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.
ఇవాళ కొట్టాయంలో గరిష్టంగా 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న వారం రోజులపాటు కూడా అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున నమోదు కానున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

