Viral Video: టెర్రస్ పైనుంచి పడిన తమ్ముడు… క్యాచ్ పట్టుకున్న అన్న
తిరువనంతపురం: ప్రమాదవశాత్తు టెర్రస్ పైనుంచి పడిన తమ్ముడిని అన్న క్యాచ్ పట్టుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు గాయపడ్డాడు. కేరళలోని మలప్పురంలో జూలై 31న ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక కుటుంబానికి చెందిన అన్నాదమ్ములు తమ ఇంటిని శుభ్రం చేస్తున్నారు. తమ్ముడు టెర్రస్‌పైన శుభ్రం చేస్తుండగా గ్రౌండ్ వద్ద ఉన్న అన్న పైప్‌తో బాల్కానీపైకి నీళ్లు చిమ్ముతున్నాడు.
అయితే టెర్రస్ క్లీనింగ్ చేస్తున్న తమ్ముడు ఒక్కసారిగా పట్టుతప్పాడు. తల కిందులుగా కిందకు పడిపోతున్న అతడ్ని కింద ఉన్న అన్న గమనించాడు. వెంటనే నీటి పైప్ వదిలేసి రెండు చేతులతో తమ్ముడ్ని పట్టుకున్నాడు. దీంతో వారిద్దరూ కింద పడిపోయారు. అయితే తమ్ముడ్ని క్యాచ్ పట్టుకున్న అన్న తల నేలకు తగిలింది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. కాగా, ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
— BHARAT TV (@VishalDharm1) August 3, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

