Kerala High Court | కొచ్చి: భార్యకు వంట రానంత మాత్రాన దానిని క్రూరత్వంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
తన భార్యకు వంట చేయడం రాదని, తనకు భోజనం వండిపెట్టకుండా తనపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నందున విడాకులు మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు విచారించింది. చట్టపరంగా దంపతులైన తర్వాత అందులో ఒకరు వివాహాన్ని రద్దు చేసుకోవడానికి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని, విడాకులు కోరడానికి గల సహేతుకమైన కారణాన్ని చూపాలని ధర్మాసనం పేర్కొంది. ‘వంట చేయడం రాకపోతే అది క్రూరత్వం ఎలా అవుతుందని’ ధర్మాసనం ప్రశ్నించింది.