సాజీ చెరియన్‌కు కేరళ గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. రేపు మంత్రిగా ప్రమాణస్వీకారం..!
Saji Cheriyan | సీపీఐ (ఎం) నేత సాజి చెరియన్ను తిరిగి క్యాబినెట్లోకి తీసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ప్రతిపాదనకు
తిరువనంతపురం: సీపీఐ (ఎం) నేత సాజి చెరియన్ను తిరిగి క్యాబినెట్లోకి తీసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆమోదముద్ర వేశారు. దాంతో చెరియన్ రేపు సాయంత్రం 4 గంటలకు కేరళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
సాజి చెరియన్ గత ఏడాది జూలైలో పథనంథిట్ట జిల్లాలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ కారణంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆయనను తిరిగి క్యాబినెట్లోకి తీసుకోవాలని సీఎం పనరయి భావించారు. ఆ మేరకు గత నెల 30న గవర్నర్‌కు అభ్యర్థన పంపారు.
అయితే, సీఎం ప్రతిపాదనపై గవర్నర్ సోమవారం అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా సీఎం మళ్లీ అదే ప్రతిపాదన చేయడంతో ఇవాళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆమోదం తెలిపారు. కాగా, కేరళ సర్కారుకు, గవర్నర్‌కు గతంలో యూనివర్సిటీల వైస్ ఛాన్సెలర్ల నియామకం సందర్భంగా వివాదం ఏర్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

