శబరిమల అయ్యప్ప క్షేత్రానికి బారులు తీరిన భక్తులు
Ayyappa Temple: కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో బారులుతీరారు. మణికంఠుడి దర్శనం కోసం వేల మంది క్యూలైన్లలో

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో బారులుతీరారు. మణికంఠుడి దర్శనం కోసం వేల మంది క్యూలైన్లలో వేచిఉన్నారు. ప్రతి ఏడాది మండలపూజ, మకరవిళక్కు ఉత్సవాల కోసం ఆలయ క్షేత్రాన్ని రెండు నెలలపాటు తెరచి ఉంచుతారు. 41 రోజుల మండల పూజల కోసం ఈ నెల 15 ఆలయాన్ని తెరిచారు. డిసెంబర్ 26న మండల పూజా ఉత్సవం ముగుస్తుంది.
ఆ రోజు ఆలయాన్ని మూసివేసి మకరవిళక్కు (మకర జ్యోతి) ఉత్సవం కోసం డిసెంబర్ 30న తిరిగి తెరుస్తారు. జనవరి 14న భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం కలుగుతుంది. జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు. మళ్లీ నవంబర్ 15 వరకు శబరిమల అయ్యప్ప క్షేత్రం మూసే ఉంటుంది. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
72 గంటలలోపు చేయించిన ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా రోజుకు 30 వేల మంది మాత్రమే దర్శనానికి వెళ్లేలా పరిమితులు విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

