కశ్మీరీ పండిట్లపై లాఠీచార్జి చేసిన పోలీస్ అధికారులను తొలగించాలి : కేజ్రీవాల్
జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన నేపధ్యంలో కశ్మీరీ పండిట్లను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కశ్మీర్లో కశ్మీరీ పండిట్ల భద్రతకు చొరవ చూపాలని కోరారు. రాహుల భట్ హత్యకు నిరసనగా కశ్మీరీ పండిట్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన నేపధ్యంలో కశ్మీరీ పండిట్లను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కశ్మీర్లో కశ్మీరీ పండిట్ల భద్రతకు చొరవ చూపాలని కోరారు. రాహుల భట్ హత్యకు నిరసనగా కశ్మీరీ పండిట్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆందోళన చేపట్టిన పండిట్లపై లాఠీచార్జి జరిపి భాష్పవాయు గోళాలు ప్రయోగించారని కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లపై లాఠీచార్జి జరిపిన పోలీసు అధికారులపై వేటు వేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నిరసన తెలుపుతున్న పండిట్లపై లాఠీచార్జి చేయడం కాదు వారిని ప్రేమతో ఆలింగనం చేసుకోవాలని హితవు పలికారు. కాగా, దేశానికి వచ్చే పర్యాటకుల్లో 50 శాతం మంది మొఘల్ ఆర్కిటెక్చర్‌ను చూసేందుకు వస్తారని, మరో 50 శాతం మంది కశ్మీర్‌ను చూసేందుకు వస్తుంటారని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ రెండింటినీ బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీలోని కుతుబ్‌మినార్ పేరును విష్ణు స్ధంభ్గా మార్చాలని డిమాండ్ చేస్తూ కాషాయ పార్టీ శ్రేణుల నిరసనల నేపధ్యంలో మెహబూబా ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. మొఘల్ పాలకుల పేరిట ఢిల్లీలో ఉన్న అక్బర్ రోడ్, హుమయూన్ రోడ్, ఔరంగ్ జేబ్ లేన్, తుగ్లక్ లేన్ల పేర్లు మార్చాలని కూడా ఢిల్లీ బీజేపీ కోరుతోంది.
ఇక కశ్మీర్లో నెలకొన్న అశాంతి, ఆ ప్రాంతంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించీ మెహబూబ్ ముఫ్తీ ప్రస్తావించారు. కశ్మీర్ పట్ల భారత ప్రభుత్వం వైఖరి మారాలని కోరారు. కశ్మీరీలపై ఒత్తిడి పెంచుతున్న ప్రభుత్వం హిందూ వర్సెస్ ముస్లింలుగా వివాదాలను ప్రేరేపిస్తూ ఇతర అంశాల నుంచి దారిమళ్లిస్తోందని దుయ్యబట్టారు. చదూరాలో తెహసిల్ధార్ కార్యాలయంలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఇటీవల ఉగ్రమూకలు కాల్చిచంపిన నేపధ్యంలో మెహబూబా ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. భట్‌ను పొట్టనపెట్టుకున్న మరుసటి రోజే అదే జిల్లాలో పనిచేసే కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్‌పై గుడూరలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

