Canada PM | ట్రూడో ప్రేమాయణంపై ఊహాగానాలకు తెర.. ఇన్‌స్టాలో ఫొటోలు పంచుకున్న పెర్రీ
Canada PM | అమెరికాకు చెందిన పాప్ సింగర్ (Pop Singer) కేటీ పెర్రీ (Katy Perry), కెనడా మాజీ ప్రధాని (Ex PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మధ్య ప్రేమాయణంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
Canada PM : అమెరికాకు చెందిన పాప్ సింగర్ (Pop Singer) కేటీ పెర్రీ (Katy Perry), కెనడా మాజీ ప్రధాని (Ex PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మధ్య ప్రేమాయణంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. తమ రిలేషన్‌షిప్‌ను కేటీ పెర్రీ అధికారికంగా ప్రకటించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జస్టిన్ ట్రూడోతో కలిసి ఉన్న పలు ఫోటోలను షేర్ చేశారు. తమ ప్రేమ బంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
ఇటీవల జపాన్‌లో పర్యటించిన ఈ జంట అక్కడ ఫొటోలు దిగింది. ఆ ఫోటోలను పెర్రీ పంచుకుంది. ఒక ఫొటోలో ఇద్దరూ చాలా సన్నిహితంగా ఒకరినొకరు హత్తుకుని సెల్ఫీ తీసుకున్నారు. మరొక వీడియోలో ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. పెర్రీ పోస్ట్‌కు ‘టోక్యో టైమ్స్ ఆన్ టూర్ అండ్ మోర్’ అని కేటీ పెర్రీ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ పరిణామం జరగడానికి కొద్ది రోజుల ముందే జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీతో కలిసి జపాన్ మాజీ ప్రధాని ఫుమియో కిషిదా, ఆయన భార్య యూకోను కలిశారు. ఈ భేటీ తర్వాత కిషిదా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో కేటీ పెర్రీని ట్రూడో భాగస్వామి అని సంబోధించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తన భాగస్వామితో కలిసి జపాన్ వచ్చారని పేర్కొన్నారు.
తామిద్దరం కలిసి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేశామని, ఆ స్నేహం ఇలా కొనసాగుతుండటం సంతోషంగా ఉందని కిషిదా పేర్కొన్నారు. కాగా కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడో తొలిసారిగా గత అక్టోబర్ 25న పారిస్‌లో కేటీ పుట్టినరోజు సందర్భంగా జంటగా కనిపించారు. అంతకుముందు జూలైలో కెనడాలో తమ పెంపుడు కుక్కలతో కలిసి వాకింగ్ చేస్తూ కెమెరా కంటపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

