Covid Vaccine | మోకాలు లోతు మంచులో వెళ్లి, వ్యాక్సిన్ ఇచ్చిన ఆరోగ్య కార్యకర్త
Covid Vaccine | అసలే జమ్మూ కశ్మీర్. ఆపై చలికాలం. ఎటు చూసినా మంచు కుప్పలే. ఎముకలు కొరికే చలే. అయినా ఓ హెల్త్ వర్కర్ వేకువ ఝామునే వ్యాక్సిన్

Covid Vaccine | అసలే జమ్మూ కశ్మీర్. ఆపై చలికాలం. ఎటు చూసినా మంచు కుప్పలే. ఎముకలు కొరికే చలే. అయినా ఓ హెల్త్ వర్కర్ వేకువ ఝామునే వ్యాక్సిన్ ఇవ్వడానికి బయల్దేరింది. ఆమె పేరు మస్రత్ ఫరీద్.. హెల్త్ వర్కర్‌గా జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆమె.. మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ కూడా… తన విధులను సక్రమంగా నిర్వర్తించారు. చలికాలం, రోడ్డులో మంచు పేరుకు పోయింది. అయినా కోవిడ్‌ను జయించాలన్న ఏకైక లక్ష్యంతో మంచు గడ్డల్లో నడుస్తూ, పర్వత ప్రాంతాల్లో వున్న వారికి వ్యాక్సిన్ అందించింది. గత యేడాది కూడా మస్రత్ ఫరీద్ బృందం దట్టమైన కొండ ప్రాంతాల్లోకి వెళ్లి, ట్రెక్కింగ్ చేస్తూ మరీ వెళ్లారు. ఇలా కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తూ, చాలా మందికి వ్యాక్సిన్‌ను అందించారు.
ఈ విషయంపై మస్రత్ ఫరీద్‌ను అడగ్గా… మనం కోవిడ్‌తో పోరాడుతున్నాం. అలాగే ముందుకు సాగాలి. ఇంకా ఇప్పటికీ కొంత మంది వ్యాక్సిన్ విషయంలో సంకోచిస్తూనే వున్నారు. హిమాలయ ప్రాంతంలో చలిని తట్టుకోవడం తేలిక. వారి నమ్మకాన్ని చూరగొనడం మాత్రం కష్టమే సుమా అంటూ మోకాళ్ల లోతు వున్న మంచులో నడుస్తూ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

