కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ చార్జీలను పెంచింది. బెంగళూరు సిటీ బస్ సర్వీసులు (బీఎంటీసీ) సహా రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ సంస్థల పెరిగిన బస్ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ బుధవారం తెలిపారు.
- దీపావళి ముంగిట కన్నడ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ వాత
- 35% వరకు పెంపు.. నేటి నుంచి అమలు..
- పెద్ద ఎక్కువేం కాదన్న మంత్రి
బెంగళూరు, నవంబర్ 4: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ చార్జీలను పెంచింది. బెంగళూరు సిటీ బస్ సర్వీసులు (బీఎంటీసీ) సహా రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ సంస్థల పెరిగిన బస్ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ బుధవారం తెలిపారు. బీఎంటీసీ కనీస టికెట్ ధరను రూ. 6 నుంచి 10కి, గరిష్ఠ ధరను 35 నుంచి 45కి పెంచారు. బీఎంటీసీ వజ్ర సర్వీసుల కనీస చార్జీ 15 నుంచి 20, గరిష్ఠ చార్జీ 75 నుంచి 90కి పెంచారు.
మంత్రి మొదట బస్చార్జీల పెంపు దశలవారీగా పెంపు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఎంత శాతం పెంచినదీ కూడా చెప్పలేదు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేఎస్ఆర్టీసీ, ఎన్డబ్ల్యూకేఆర్టీసీ, కేకేఆర్టీసీ సర్వీసుల చార్జీ 23 శాతం వరకు, బీఎంటీసీ సర్వీసులు 33-35 శాతం వరకు పెరుగుదల ఉంటుందని మాత్రమే చెప్పారు. ఈ పెరుగుదల పెద్ద ఎక్కువేమీ కాదని ఆయన సమర్థించుకున్నారు. కాగా, ముగ్గురు సభ్యుల పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఫేర్ రెగ్యులేటరీ కమిటీ కేఎస్ఆర్టీసీ, ఎన్డబ్ల్యూకేఆర్టీసీ, కేకేఆర్టీసీ లకు 25 శాతం, బీఎంటీసీకి 40 శాతం చార్జీలు పెంచాలని సిఫార్సు చేసింది.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే శక్తి పథకం కింద ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా పొందేందుకు ప్రయత్నిస్తానని మంత్రి హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు ఆర్టీసీ సంస్థలు రూ.9,912 కోట్ల నష్టంతో నడుస్తున్నాయని, అయితే ఈ నష్టం శక్తి పథకం వల్ల వచ్చింది కాదని ఆయన అన్నారు. ఇటీవల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా బస్ చార్జీలు పెంచాయని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

