కర్ణాటకలో దారుణం.. కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించిన తండ్రి
వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్‌ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్‌కు అప్పగించి..
బెంగళూరు: కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి కన్న కుమారుడ్ని తండ్రి హత్య చేయించాడు. కర్ణాటకలోని హుబ్లీలో ఈ దారుణం జరిగింది. 26 ఏళ్ల అఖిల్ జ్యుయలరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ అఖిల్ తండ్రి భరత్ మహాజన్‌శెట్టి ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు ఫోన్ చేశాడని, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించారు. కొన్ని ఆధారాలు లభించిన తర్వాత తండ్రి భరత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్‌ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్‌కు అప్పగించి ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లినట్లు తెలిపాడు. కిల్లర్లు అతడ్ని హత్య చేసి దేవికొప్పలోని చెరకు పొలాల వద్ద మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పాడు.
పోలీసులు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. కిమ్స్ ఫోరెన్సిక్ వైద్య నిఫుణులతో పోస్ట్‌మార్టం చేయించారు. మృతుడి తండ్రి భరత్‌తోపాటు ఆరుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో మరి కొంతమంది పాత్ర కూడా ఉండవచ్చని పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

