Karnataka | ఇకపై అక్కడ 14 గంటలు పనిచేయాల్సిందే.. కర్ణాటకలో టెకీల పని గంటలు పెంపు!
కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటల్ని 14కు పెంచే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక బిల్లును సిద్ధం చేసింది.
- కర్ణాటక కాంగ్రెస్ సర్కారు యోచన
- ముసాయిదా బిల్లు సిద్ధం
- వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు
Karnataka | బెంగళూరు: కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటల్ని 14కు పెంచే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక బిల్లును సిద్ధం చేసింది. కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు-2024ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ముసాయిదా బిల్లును రాష్ట్ర సర్కార్ సిద్ధం చేయటం ఐటీ రంగంలో కలకలం రేపింది. ఈ ప్రతిపాదనలపై ఐటీ ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్య అత్యంత అమానవీయమైందిగా ఐటీ ఉద్యోగుల యూనియన్లు నిరసనకు దిగుతున్నాయి.
రాష్ట్ర ఐటీ, ఐటీ అనుబంధ ఉద్యోగ సంఘం (కేఐటీయూ) ప్రతినిధులు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్‌ను కలుసుకొని తమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఓవర్టైమ్తో కలుపుకొని గరిష్టంగా రోజులో 10 పనిగంటలు మాత్రమే పని చేయించేందుకు అనుమతి ఉంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పిస్తూ సిద్ధరామయ్య సర్కార్ తీసుకొచ్చిన బిల్లుపై ఐటీ రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లుపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఐటీ ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ.. మరో బిల్లును తీసుకురావటం చర్చనీయాంశమైంది.
కర్ణాటకలో ‘బాయ్‌కాట్ ఫోన్‌పే’ ట్రెండింగ్
కర్ణాటకలో స్థానిక కోటా బిల్లుకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన డిజిటల్ పేమెంట్ దిగ్గజ సంస్థ ‘ఫోన్‌పే’ సీఈవో సమీర్ నిగమ్‌పై కన్నడిగులు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఫోన్‌పేను బహిష్కరించాలని, ఆ యాప్‌ను ఫోన్ల నుంచి అన్ఇన్స్టాల్ చేయాలంటూ కన్నడ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. #Boycott PhonePe, # Uninstall PhonePe అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఎక్స్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ల తప్పనిసరి బిల్లు సరికాదని నిగమ్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

