‘చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవి. వాటిని వ్యక్తులైనా; బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లాంటి సంస్థలైనా అతిక్రమించలేవు. వారు మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య విద్వేషాలను పెంచలేరు. మేము చట్ట పరంగా అలాంటి వాటిపై నిషేధం లాంటి చర్యలను తీసుకుంటాం’
– కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ
‘హనుమంతుడిపై మనకున్న విశ్వాసాన్ని ప్రధాని అవమానిస్తున్నారు. ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలి. హనుమంతుడిని అవమానించే హక్కు ఆయనకు ఎవరిచ్చారు? బజ్రంగ్ దళ్‌ను మన దేవుడైన బజ్రంగ్ బలితో మోదీ ఎలా పోలుస్తారు?’
– మోదీ స్పందనపై కాంగ్రెస్ విమర్శ
‘కాంగ్రెస్ గతంలో రాముడికి తాళం వేసింది. ఇప్పుడు ‘జై బజరంగ్ బలి’ అని జపించే నోళ్లకు తాళం వేయాలని చూస్తున్నది’.
– కాంగ్రెస్ హామీపై మోదీ స్పందన
వాస్తవాల్ని వక్రీకరించి తమ రాజకీయ లబ్ధికి వాడుకోవడమే ‘విద్యార్హత’గా గలవారికి బజ్రంగ్ దళ్‌కు, బజ్రంగ్ బలికి తేడా ఎలా తెలుస్తుంది? అందుకే దేశానికి విద్యాధికుడైన ప్రధాని కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనడం సరైనదేనని సామాన్యులు చర్చించుకుంటున్నారు.
– నేషనల్ డెస్క్