అక్రమరీతిలో ఓటర్ల డేటా సేకరణ.. కర్నాటక సీఎంపై ఆరోపణలు
Karnataka CM Bommai: ఓటర్ల నుంచి అక్రమరీతిలో డేటాను సేకరిస్తున్నట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైపై ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఎన్జీవో ద్వారా బెంగుళూరు ఓటర్ల నుంచి డేటా సేకరించినట్లు తెలుస్తోంది. సీఎం బొమ్మై ఎన్నికల ఫ్రాడ్‌కు పాల్పడ్డారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చిలుమే ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఓటర్ల నుంచి అదనపు సమాచారాన్ని సేకరించినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘం ద్వారా ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ సమయంలో ఓటర్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బెంగుళూరు: ఓటర్ల నుంచి అక్రమరీతిలో డేటాను సేకరిస్తున్నట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైపై ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఎన్జీవో ద్వారా బెంగుళూరు ఓటర్ల నుంచి డేటా సేకరించినట్లు తెలుస్తోంది. సీఎం బొమ్మై ఎన్నికల ఫ్రాడ్‌కు పాల్పడ్డారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చిలుమే ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఓటర్ల నుంచి అదనపు సమాచారాన్ని సేకరించినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘం ద్వారా ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ సమయంలో ఓటర్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కులం, విద్యార్హతలు, మాతృభాష, ఆధార్ సంఖ్య, ఇతర వివరాలను ఎన్జీవో సేకరించింది. అయితే బూత్ లెవల్ ఆఫీసర్లమంటూ ఎన్జీవో ఆ డేటాను సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం బొమ్మై, బెంగుళూరు నగరపాలక కమీషనర్, ఇతర అధికారులపై కాంగ్రెస్ పార్టీ పోలీసు కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అక్రమాలకు సీఎం పాల్పడ్డారని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల నుంచి సేకరించిన డేటాను ప్రభుత్వం సైట్లో పొందుపరచలేదని, ప్రైవేట్ సంస్థకు చెందిన డిజిటల్ సమీక్ష అప్లికేషన్లో అప్లోడ్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను సీఎం బొమ్మై కొట్టిపారేశారు. ఆ ఆరోపణలు నిరాధారమన్నారు. ఈ అంశంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ప్రభుత్వ అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

