By-Polls | కర్ణాటక ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బ
BY-Polls: కర్ణాటక ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొమ్మై సొంత జిల్లా హవేరీలోని హంగల్ నియోజకవర్గంలో

బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొమ్మై సొంత జిల్లా హవేరీలోని హంగల్ నియోజకవర్గంలో అధికార బీజేపీ ఓటమి పాలైంది. హంగల్లో బీజేపీ అభ్యర్థి శివరాజ సజ్జనార్‌ను కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానె 7,598 ఓట్ల తేడాతో ఓడించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థి ఇంత ఘోరంగా ఓడిపోవడం బసవరాజ్ బొమ్మైకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 100 రోజుల తర్వాత ఈ ఉప ఎన్నికలు జరిగాయి.
అయితే, కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన మరో నియోజకవర్గం సిండ్‌గీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ భూసనూర్ 31,185 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. రమేశ్ భూసనూర్కు 93,865 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ మనగులికి 62,680 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ.. సీఎం సొంత జిల్లాలోని నియోజవర్గంలో పరాజయం పాలు కావడం సీఎం బొమ్మై ఇమేజ్ను డ్యామేజ్ చేసిందనే చెప్పవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

