Karnataka | మంత్రి అల్లుడి కోసం కొత్త పోస్టు.. ఆర్థిక విభాగం ఆమోదానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ లేఖ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడి కోసం అసెంబ్లీలో ఒక కొత్త పోస్టును సృష్టించడం రాజకీయ దుమారం రేపింది.
- కర్ణాటక అసెంబ్లీలో ‘సెక్రటరీ-2’ సృష్టి
- కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం
Karnataka | బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడి కోసం అసెంబ్లీలో ఒక కొత్త పోస్టును సృష్టించడం రాజకీయ దుమారం రేపింది. విధానసభలో ‘అసెంబ్లీ కార్యదర్శి’ అనే ఒక పోస్టు ఇప్పటికే ఉండగా.. దానికి అదనంగా ‘సెక్రటరీ-2’ అనే పోస్టును సృష్టించి, దాన్ని అమాత్యుడి అల్లుడికి కేటాయించేందుకు ప్రభుత్వం పావులు కదపడంపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
కొత్త పోస్టు సృష్టికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ అసెంబ్లీ ఆర్థిక విభాగానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు శశిధర్ కోసం ఈ కొత్త పోస్టును ఏర్పాటు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సెక్రటరీ అవకాశం లేకపోవడంతో..
కొత్త పోస్టును సృష్టించడాన్ని కర్ణాటక విధాన సభ ఉద్యోగుల సంఘం వ్యతిరేకించింది. శశిధర్‌కు సెకట్రరీ పోస్టు వచ్చే అవకాశం లేకపోవడంతోనే ‘సెక్రటరీ-2’ అనే పోస్టును ఏర్పాటు చేయించారని అసెంబ్లీ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ మండిపడింది. ఎమ్మెల్యేల తిరుగుబాటు ప్రయత్నాలను చల్లార్చేందుకు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ 90 క్యాబినెట్ గ్రేడ్ స్థాయి హోదాలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు మంత్రి అల్లుడి కోసం కొత్త పోస్టును సృష్టించారని అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

