Bride | ముస్తాబయ్యేందుకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి.. బాయ్ ఫ్రెండ్‌తో పారిపోయిన పెళ్లి కూతురు
Bride | ఓ యువతికి ఇష్టం లేని పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీంతో రెడీ అయ్యేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన పెళ్లి కూతురు.. అటు నుంచి అటే బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది.
Bride | లక్నో : ఓ యువతికి ఇష్టం లేని పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీంతో రెడీ అయ్యేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన పెళ్లి కూతురు.. అటు నుంచి అటే బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌లోని చౌబేపూర్కు చెందిన ఓ కుటుంబం గత 25 ఏండ్ల నుంచి లక్నోలో నివాసం ఉంటోంది. అక్కడే ఆ కుటుంబంలోని ఓ యువతికి స్థానికంగా ఉండే యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో పేరెంట్స్ యువతిని మందలించారు. వేరే కులానికి చెందిన యువకుడితో పెళ్లి చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఇక తమ కులం వ్యక్తితో ఆ యువతికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెకు సంబంధం ఓకే చేశారు. జనవరి 30వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండే. అయితే రెడీ అయ్యేందుకు బ్యూటీ పార్లర్ వెళ్తున్నానని చెప్పి, యువతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఇక బ్యూటీపార్లర్ నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బాయ్ ఫ్రెండ్‌తో నిత్యం కాంటాక్ట్‌లో ఉంటూ, అతనితో వెళ్లిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై వరుడి కుటుంబ సభ్యులు స్పందించారు. మరో యువకుడితో ఆమెకు సంబంధాలు ఉన్నాయని తెలిసీ, తనతో పెళ్లి చేయాలనుకోవడం సబబు కాదని పెళ్లి కుమారుడు తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

