Kacha Badam singer | కచ్చా బాదమ్ సింగర్ భుబన్‌కు యాక్సిడెంట్.. ఎలా జరిగిందంటే?
ఓవర్ నైట్ స్టార్‌ను చేసిన కచ్చాబాదమ్ పాట.. భుబన్‌కు లక్షలు తెచ్చిపెట్టింది. వెస్ట్ బెంగాల్లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. భుబన్
Kacha Badam singer | బాదామ్ బాదమ్.. కచ్చా బాదమ్ అంటూ వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ కచ్చా బాదమ్ సాంగ్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిన విషయం తెలిసిందే కదా. భుబన్ బద్యాకర్ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ.. కచ్చా బాదమ్ సింగర్ అంటే ఆయన్ను అందరూ గుర్తు పడతారు. ఒక్కటంటే ఒక్క పాటతో ఇంటర్నేషనల్ స్టార్డమ్ వచ్చింది భుబన్‌కు.
ఓవర్ నైట్ స్టార్‌ను చేసిన కచ్చాబాదమ్ పాట.. భుబన్‌కు లక్షలు తెచ్చిపెట్టింది. వెస్ట్ బెంగాల్లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అయితే భుబన్‌కు తాజాగా యాక్సిడెంట్ అయింది. కచ్చా బాదమ్ పాట కోసం ఓ మ్యూజిక్ ఆల్బమ్ కంపెనీ భుబన్‌కు మూడు లక్షల రూపాయల పారితోషికం ఇచ్చింది. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొన్న భుబన్.. దాన్ని నేర్చుకుంటున్న క్రమంలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన చాతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం కోల్‌కతాలోని సూరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో భుబన్ చికిత్స పొందుతున్నాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన చోటు చేసుకుంది.

భుబన్ బద్యాకర్ది వెస్ట్ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా లక్ష్మీనారాయణ్‌పూర్ అనే గ్రామం. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. మొన్నటి వరకు వీధుల్లో సైకిల్ మీద పల్లీలు అమ్ముతూ తన జీవనాన్ని సాగించాడు భుబన్. రోజూ 3 నుంచి 4 కిలోల పల్లీలు అమ్మి రూ.250 వరకు సంపాదించేవాడు. కచ్చా బాదమ్ పాటతో ఫేమ్ అయిపోయాక.. ఇక పల్లీలు అమ్మను.. అంటూ భుబన్ ప్రకటించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

