జూనియర్ డాక్టర్ల నిరసన ఉధృతం
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం 9వ రోజుకు చేరుకుంది. కోల్‌కతా, సిలిగురి నగరాల్లో ముగ్గురు జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
- 9వ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష
- రాజీనామాకు సిద్ధమైన 77 మంది వైద్యులు
కోల్‌కతా, అక్టోబర్ 13: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం 9వ రోజుకు చేరుకుంది. కోల్‌కతా, సిలిగురి నగరాల్లో ముగ్గురు జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ ఆందోళనపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కార్ స్పందించటం లేదని నిరసన చేపట్టిన వైద్యులు ఆరోపించారు.
ఆందోళన చేస్తున్న జూడాలు ఆదివారం ‘ఆరంధన్’ (వంట వద్దు)కు పిలుపునివ్వగా, రాష్ట్రంలో పలుచోట్ల వారికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. వైద్యుల నిరసనకు సంఘీభావం తెలుపుతూ, 12 గంటలపాటు నిరాహార దీక్షను పాటించారు. ఆర్జీ కర్ దవాఖాన వైద్యులు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న వందలాది మంది వైద్యులు జూనియర్ డాక్టర్ల దీక్షకు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా మరో 77 మంది వైద్యులు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే వైద్యుల సామూహిక రాజీనామాలను మమత సర్కార్ తిరస్కరించింది. సామూహిక రాజీనామాల్ని ఆమోదించటం లేదని సీఎం ముఖ్య సలహాదారు అలపాన్ బందోపాధ్యాయ తెలిపారు.
ఎంపిక చేసుకున్న సేవల షట్ డౌన్‌కు పిలుపు
సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా దవాఖానల్లో ఎంపిక చేసిన సేవలను షట్ డౌన్ చేయాలని ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫైమా) పిలుపునిచ్చింది. అయితే ఎమర్జెన్సీ సేవలను మాత్రం కొనసాగించాలని ఆ సంఘం రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్లను కోరింది. జూనియర్ డాక్టర్ట దీక్షకు ఫైమా మద్దతు ప్రకటించగా, ఈ నెల 15న ఒక రోజు దేశవ్యాప్త నిరాహార దీక్షకు ఐఎంఎ పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

