రాహుల్ నన్ను తోసేశాడు
సర్ ప్రక్రియపై విపక్షాలు జరిపిన నిరసన సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన చేతిని దురుసుగా లాగి, తోసివేశారని మూడు నెలల గర్భవతి అయిన ఒక జర్నలిస్టు ఆరోపించారు. అయితే ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని కాంగ్రెస్ ఖండించింది. ఇది బీజేపీ సృష్టించిన ప్రచారమని పార్టీ పేర్కొంది. తనపై దాడి జరిగిందని ఆరోపించిన ‘ఒన్ ఇండియా’ వార్తా వెబ్‌సైట్‌కు చెందిన రిచా పరాశర్ దేశ రాజధానిలోని ఒక దవాఖానలో చేరారు.
- గర్భిణి జర్నలిస్టు తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: సర్ ప్రక్రియపై విపక్షాలు జరిపిన నిరసన సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన చేతిని దురుసుగా లాగి, తోసివేశారని మూడు నెలల గర్భవతి అయిన ఒక జర్నలిస్టు ఆరోపించారు. అయితే ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని కాంగ్రెస్ ఖండించింది. ఇది బీజేపీ సృష్టించిన ప్రచారమని పార్టీ పేర్కొంది. తనపై దాడి జరిగిందని ఆరోపించిన ‘ఒన్ ఇండియా’ వార్తా వెబ్‌సైట్‌కు చెందిన రిచా పరాశర్ దేశ రాజధానిలోని ఒక దవాఖానలో చేరారు. రాహుల్ గాంధీ మద్దతుదారులు తన గురించి దుర్భాషలాడటం, తాను అనుభవించిన ఘటనను తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ఆమె చెప్పారు.

డీకేను అవమానించిన రాహుల్: హిమంత
న్యూఢిల్లీలో జరిగిన విపక్షాల ర్యాలీలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాలర్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లాగుతున్నట్టుగా ఉన్న ఒక వీడియోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను బహిరంగ అవమానంగా అభివర్ణించిన ఆయన కర్ణాటక సీఎం దీనిని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. కర్ణాటక ముఖ్యమంత్రి(డీకే) కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అలాగే ఘనమైన చరిత్ర, సంపన్నమైన సంస్కృతి, గొప్ప ఆత్మగౌరవం కలిగిన ఒక రాష్ర్టానికి ముఖచిత్రంగా ఉన్నారు. డీకే ఈ బహిరంగ అవమానానికి తలొగ్గుతారా? అని హిమంత ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

