త్రివిధ దళాల సమష్టితత్వం చాలా ముఖ్యం: నేవీ చీఫ్
Navy Chief Karambir Singh: భూమి, సముద్రం, గాలి, అంతరిక్షం, సైబర్ స్పేస్ వంటి వాటన్నిటిలోనూ ప్రత్యర్థులను ఎదుర్కోవడం ముఖ్యమని నేవీ చీఫ్ చెప్పారు.

పుణె: కాలం మారుతున్నా కొద్ది యుద్ధ స్వభావం మారుతూ వస్తున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాలు పరస్పర సహకారంతో, సమష్టి తత్వంతో పని చేయాలని భారత నావికాదళం చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ అభిప్రాయపడ్డారు. శనివారం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) 140వ కోర్సు పాసింగ్ అవుట్ పెరేడ్‌ను సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు.
భూమి, సముద్రం, గాలి, అంతరిక్షం, సైబర్ స్పేస్ వంటి వాటన్నిటిలోనూ ప్రత్యర్థులను ఎదుర్కోవడం ముఖ్యమని నేవీ చీఫ్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాలు కలిసికట్టుగా, సమష్టితత్వంతో పని చేయవలసిన అవసరం ఉందన్నారు. మన దేశ రక్షణ రంగంలో చాలా ముఖ్యమైన సంస్కరణలు జరుగుతున్నట్లు తెలిపారు. మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవస్థ ఏర్పాటు లాంటివి అందుకు నిదర్శనమని చెప్పారు.
భవిష్యత్తులో యుద్ధం ఏవిధంగా ఉంటుందనే దానితో సంబంధం లేకుండా సమర్థ నాయకత్వానికి కొన్ని వ్యక్తిగత సామర్థ్యాలు, ఆకర్షణలు చాలా ముఖ్యమైనవనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం నాయకత్వ లక్షణమని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

