తవాంగ్ ఘటనపై చర్చకు నిరాకరించిన రాజ్యసభ చైర్మన్.. ప్రతిపక్షాలు వాకౌట్
Rajya Sabha | అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై రాజ్యసభలో తీవ్ర దుమారం
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగుతున్నది. సరిహద్దుల్లో ఘర్షణపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన తీర్మానాలను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు.
దాంతో కాంగ్రెస్ సభ్యులతోపాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలు మూకుమ్మడిగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నది. కీలకమైన ఆ అంశంపై చర్చించకుండా సభలో ఇంకా ఏ అంశంపై మనం చర్చిస్తాం? తవాంగ్ ఘటనపై చర్చ జరపాల్సిందే అని డిమాండ్ చేశారు.
అయినా, సభాపతి ధన్కర్ అందుకు ఒప్పకోకపోవడంతో ప్రతిపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై చర్చ చేపట్టకపోతే ఊరుకునే సమస్యే లేదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

