Pnnun Case | పన్నూన్ హత్యకు కుట్ర కేసు.. భారత్‌కు సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్..!
Pnnun Case | సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్‌ను భారత్‌కు పంపినట్లు గతంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
వాషింగ్టన్: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్‌ను భారత్‌కు పంపినట్లు గతంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్ గత ఆగస్టులో భారత్‌కు వచ్చినట్లు పేర్కొంది. పన్నూన్ హత్యకు ఓ భారతీయుడు కుట్ర చేస్తున్నాడని అమెరికా వర్గాలు గుర్తించిన తర్వాతే బర్న్స్ పర్యటన జరిగిందని తెలిపింది.
భారత్‌లోని ఓ అధికారి కనుసన్నల్లోనే పన్నూన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు ఆగస్టులో భారత్‌కు వచ్చిన విలియం బర్న్స్ ఇక్కడి రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) చీఫ్ రవి సిన్హాతో భేటీ అయినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. పన్నూ హత్యకు జరిగిన కుట్రపై విచారణ అవసరమని, అందుకు భారత్ సహకరించాలని ఆయన కోరినట్లు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా భారత్ నుంచి అమెరికా స్పష్టమైన హామీ కోరినట్లు సమాచారం.
పన్నూ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు జూలైలోనే వదంతులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ఉన్నత స్థాయి అధికారులు పరస్పరం చర్చలు జరిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అమెరికా డిమాండ్ చేసింది. మరోవైపు సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ విషయాన్ని కూడా లేవనెత్తినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. నవంబర్‌లో అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ భారత్ పర్యటన సందర్భంగానూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు సదరు వార్తాసంస్థ పేర్కొంది.
అమెరికా అందించిన సమాచారం మేరకు భారత్ అప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. అంతలోనే భారతీయుడిపై అభియోగాలు మోపడంతోపాటు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం చర్చనీయాంశమైంది. పన్నూ హత్యకు కుట్ర పన్నాడని భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడం ఆందోళన కలిగించే విషయమని గురువారం భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

