Jaya hey 2.0 | ‘జన గణ మన..’ గేయంలో ఐదు చరణాలు తెలుసా..? ఈ వీడియో చూడండి
Jaha hey 2.0 | దేశ స్వాతంత్య్ర దినం వజ్రోత్సవం వేళ ‘జన గణ మన’ గేయంలోని ఐదు చరణాలను దేశ ప్రజలందరికీ తెలిసేలా అంబుజా నెవాటియా గ్రూప్ చిరు ప్రయత్నం చేసింది. జయ హే 2.0 పేరుతో వీడియోను...
Jaya hey 2.0 | ‘జన గణ మన అధినాయక జయహే భారత భాగ్య విధాత’.. ఈ గేయం మనకందరికీ తెలిసిందే. పాడగలం కూడా. అయితే, ప్రస్తుతం మనమంతా ఈ గేయంలోని ఒక చరణం మాత్రమే పాడుతున్నాం. ఈ 52 సెకండ్ల నిడివి గల ఈ గేయం ఒక చరణం కాదని… ఈ గేయంలో ఐదు చరణాలు ఉంటాయని మనలో ఎంత మందికి తెలుసు. దేశ స్వాతంత్య్ర దినం వజ్రోత్సవం వేళ ‘జన గణ మన’ గేయంలోని ఐదు చరణాలను దేశ ప్రజలందరికీ తెలిసేలా అంబుజా నెవాటియా గ్రూప్ చిరు ప్రయత్నం చేసింది. జయ హే 2.0 పేరుతో వీడియోను తీసుకొచ్చారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన ఈ గేయాన్ని 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది కళాకారులు ఆలపించి ఆకట్టుకున్నారు. గురుదేవ్ రవీంద్రుడి 150 వ జయంతి సందర్భంగా ‘జన గణ మన’ గేయంలోని ఐదు చరణాలతో వీడియో తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందని అంబుజా నెవాటియా గ్రూప్ చైర్మన్ హర్ష్‌వర్దన్ చెప్పారు. రెండు నెలల క్రితం ఈ గేయం రిహార్సల్స్ ప్రారంభించి 75 మందిని సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ప్రాజెక్టును పూర్తిచేయగలిగారు. ఈ వీడియోను దేశంలోని 12 నగరాల్లో చిత్రీకరించారు. మనకు తెలిసిన చాలా మంది గాయనీగాయకులు, వాయిద్యకారులు ఈ వీడియో తయారీలో పాలుపంచుకుని ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవడంలో సహకరించారు.
రవీంద్రుడు అందించిన ‘జన గణ మన’ గేయంలోని ఆ 5 చరణాలు మనందరి కోసం…
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

