న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ‘డబ్బులు ఊరికేరావు’ అంటారు కొందరు. కానీ, ఏ పనీచేయకుండా గంటకు రూ.5 వేలు సంపాదిస్తున్నాడు జపాన్‌కు చెందిన 38 ఏండ్ల షోజీ మోరిమోటో. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా! జపాన్‌లో ఒంటరిగా బయటకు వెళ్లే వారికి తోడుగా వెళ్తాడు. గంటకు 10,000 యేన్ చార్జ్ చేస్తాడు. అంటే భారత కరెన్సీలో రూ.5,633. ఆ మొత్తం చెల్లిస్తేనే అతడు తోడుగా ఉంటాడు. పైగా అతడికి ఎలాంటి పని చెప్పకూడదు. ఒంటరిగా జీవించే వారికి ‘నేను తోడుగా ఉంటా’ అంటూ మందుకొస్తాడు షోజీ. గతంలో షోజీ ఓ పబ్లిషింగ్ కంపెనీలో పనిచేసేవాడు. ఆ ఉద్యోగం అతడికి నచ్చక మానేశాడు.