కుప్వారాలో భారీ ఆయుధాలు స్వాధీనం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కుప్వారాలో పోలీసులు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నది. హజామ్ మొహల్ల వద్ద సైన్యంతో కలిసి జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 10 పిస్టల్స్, 17 పిస్టల్ మ్యాగజైన్లు, 54 పిస్టల్ రౌండ్లు, ఐదు గ్రెనేడ్లు ఉన్నాయని పోలీసులు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారు జామున జమ్మూకశ్మీర్ పోలీసులు సైన్యంతో కలిసి హంద్వారాలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద ఒక చైనీస్ పిస్టల్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, 9 ఎంఎం 13 లైవ్ రౌండ్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. వారం రోజుల కిందట అనంతనాగ్ పోలీసులు ఒక షార్ట్ బ్యారెల్ ఏకే-56, రెండు ఏకే మ్యాగ్, రెండు పిస్టల్స్, మూడు పిస్టల్ మ్యాగ్, ఆరు హ్యాండ్ గ్రెనేడ్లు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

