Jabalpur boat tragedy | జబల్పూర్ బోటు ప్రమాదం.. మరో రెండు మృతదేహాలు లభ్యం.. 13కి చేరిన మృతుల సంఖ్య
Jabalpur boat tragedy | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లా (Jabalpur district) బర్గీ డ్యామ్ (Burgi dam) లో జరిగిన క్రూయిజ్ బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. ఆదివారం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. వారిలో ఐదేళ్ల బాలుడు, 50 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ఐదేళ్ల బాలుడు మయూరామ్ (Mayuram) కు 50 ఏళ్ల కామరాజ్ (Kamaraj) మేనమామగా గుర్తించారు.
Jabalpur boat tragedy : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లా (Jabalpur district) బర్గీ డ్యామ్ (Burgi dam) లో జరిగిన క్రూయిజ్ బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. ఆదివారం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. వారిలో ఐదేళ్ల బాలుడు, 50 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ఐదేళ్ల బాలుడు మయూరామ్ (Mayuram) కు 50 ఏళ్ల కామరాజ్ (Kamaraj) మేనమామగా గుర్తించారు. ఈ ఇద్దరితో కలిసి బోటు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 13కు చేరినట్లయ్యింది. మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
మూడు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 30న సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. అదేరోజు స్థానికులు, సహాయక బృందాలు కలిసి 28 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 9 మృతదేహాలను వెలికి తీశారు. ఆ తర్వాత రోజు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ మరో రెండు మృతదేహాలు నీటిపై తేలుతుండటాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించి బయటికి తీసుకొచ్చాయి. ఈ ఇద్దరితో కలిసి మృతుల సంఖ్య 13కు పెరిగింది.
అయితే సీసీ కెమెరా ఫుటేజీని బట్టి చూస్తే ప్రమాదానికి ముందు మొత్తం 43 మంది ప్రయాణికులు బోటు ఎక్కారు. వారిలో 28 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడగా.. 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అంటే మొత్తం 43 మంది లెక్కు వచ్చారు. మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

