25% సంపద 1% మందివద్దే
- 40 శాతం జనాభా చేతిలో ఉన్న సంపద 19.8 శాతమే
- 22% మంది భారతీయుల సంపాదన రోజుకు రూ.160
- ఐక్యరాజ్యసమితి వెల్లడి
- లింగ అభివృద్ధి సూచీలో ఆఫిక్రా దేశాల కంటే వెనుకబడిన భారత్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆర్థికాభివృద్ధిలో భారత్ దూసుకుపోతున్నదని ఊదరగొట్టినా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ను వెనక్కు నెట్టామని జబ్బలు చరుచుకొన్నా.. దేశంలో ఇప్పటికీ ప్రజల కనీస అవసరాలైన తిండి, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో లేవన్న పచ్చి నిజం బట్టబయలైంది. బీజేపీ పాలనలో సంపద కేంద్రీకరణ అసాధారణ స్థాయికి చేరిందని తేటతెల్లమైంది.
దేశంలోని మొత్తం సంపదలో 25 శాతం కేవలం ఒక శాతం కుబేరుల చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఏటా ప్రచురించే మానవాభివృద్ధి నివేదిక (హెచ్‌డీఐ)లో తేలింది. గత 32 ఏండ్లలో తొలిసారి వరుసగా రెండు సంవత్సరాలు భారత్‌లో మానవాభివృద్ధి తిరోగమనంలోనే ఉన్నదని వెల్లడైంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనం ఐదో స్థానంలో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం గప్పాలు కొడుతున్నప్పటికీ మానవాభివృద్ధిలో పేద దేశాలకంటే వెనుకన ఏకంగా 132వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హెచ్‌డీఐ రిపోర్టులోని 90 శాతం దేశాల్లో మానవాభివృద్ధి 2020 నాటి స్థాయికి పడిపోగా భారత్‌లో ఏకంగా 2016 నాటి స్థాయికి దిగజారింది.

హెచ్డీఐలో భారత్‌కు సంబంధించిన కీలకాంశాలు
- హెచ్‌డీఐ స్కోరును 0 నుంచి 1 వరకు లెక్కిస్తారు. ఇందుకోసం నాణ్యమైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య, నాణ్యమైన జీవన ప్రమాణాలు, మేధో సంపద వంటి 12 అంశాలను ప్రామాణికంగా తీసుకొంటారు. ఈ ఏడాది భారత్ స్కోరు 0.633గా నమోదైంది. బ్రెజిల్, బంగ్లాదేశ్.. చివరకు ఇరాక్ కూడా ఈ జాబితాలో మనకంటే ముందున్నది.
- ప్రజలు ఎంత పేదరికంలో మగ్గిపోతున్నారో తెలుసుకొనేందుకు యూఎన్డీపీ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) అనే ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొంటుంది. దీనిని కూడా 12 అంశాల ఆధారంగా నిర్ధారిస్తారు. భారత్‌లో 27.9 శాతం మంది ఇంకా ఎంపీఐ పరిధిలోనే ఉన్నారని హెచ్‌డీఐ నివేదికలో తేలింది. 22 శాతం మంది భారతీయుల సంపాదన రోజుకు రూ.160 కంటే తక్కువే. భారత్ ఎంపీఐ స్కోరు 0.123. ఈ అంశంలో మనదేశం హైతీకంటే వెనుకబడి ఉన్నది.
- దేశంలో మూడింట ఒకవంతు జనాభా కఠిక దరిద్రంలో మగ్గిపోతుండగా, కేవలం 1 శాతం మంది కుబేరుల చేతిలో దేశంలోని మొత్తం సంపదలో ఏకంగా 21.7 శాతం కేంద్రీకృతమై ఉన్నది. 40 శాతం జనాభా చేతిలో ఉన్న సంపద మొత్తం 19.8 శాతమే.
- లింగ సమానత్వంలోనూ మనం ఎక్కడో వెనుకబడే ఉన్నాం. భారత్ జెండర్ ఇనీక్వాలిటీ ఇండెక్స్ (జీఐఐ) స్కోరు 2021లో 0.490గా నమోదైంది. 2020లో ఇది 0.493 ఉండగా, 2019లో 0.486 ఉన్నది. అంటే లింగ సమానత్వంలో భారత్ 2019 నాటికంటే దిగజారింది. పునరుత్పత్తి ఆరోగ్యం, సాధికారత, కార్మికుల భాగస్వామ్యం విషయంలో ఘనా, మార్షల్ ఐలండ్‌ల మధ్యలో 132వ స్థానంలో మనం ఉన్నాం.
- లింగ అభివృద్ధి సూచీ (జీడీఐ)లోనూ చాలా ఆఫ్రికా దేశాలకంటే మనం వెనుకబడే ఉన్నాం. జీడీఐలో బాలురు, బాలికల పాఠశాల విద్యా కాలం, మహిళలు, పురుషుల తలసరి ఆదాయంను పరిగణనలోకి తీసుకొంటారు. భారత్‌లో బాలికలు సగటున 6.3 ఏండ్లపాటు పాఠశాల విద్యను అభ్యసిస్తుండగా, బాలురు రూ.7.2 ఏండ్లు స్కూలు వెళ్తున్నారు. మహిళల తలసరి ఆదాయం రూ.1,81,375.57 (2,277 డాలర్లు) ఉండగా, పురుషుల తలసరి ఆదాయం రూ.8,46,976.93 (10,633 డాలర్లు) ఉన్నది. మహిళల ఆయుర్దాయం 65.8 ఏండ్లు ఉండగా, పురుషుల ఆయుర్ధాయం 68.9 ఏండ్లు ఉన్నది. మొత్తంగా మహిళ జీడీఐ స్కోరు 0.567 ఉండగా, పురుషుల జీడీఐ స్కోరు 0.668గా నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

