Bajrang Bali | ‘బజరంగ్‌బలి’ కాంగ్రెస్‌తో ఉన్నారు.. అవినీతి బీజేపీ తలపై ‘గద’తో కొట్టారు: భూపేష్ బఘేల్
Bajrangbali | ‘బజరంగ్‌బలి ఎవరితో ఉన్నారో మీరు చూశారు. బజరంగ్ బలి తన ‘గద’తో అవినీతి బీజేపీ తలపై కొట్టి ఓడించారు’ అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. కర్ణాటక ఎన్నికలను కేంద్రీకృతం చేయాలని భావించిన బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదని ఆయన విమర్శించారు.
రాయ్‌పూర్: ‘బజరంగ్‌బలి’ (Bajrang Bali – హనుమంతుడు) కాంగ్రెస్‌తోనే ఉన్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాల ద్వారా ఇది స్పష్టమైందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.‘బజరంగ్‌బలి ఎవరితో ఉన్నారో మీరు చూశారు. బజరంగ్ బలి తన ‘గద’తో అవినీతి బీజేపీ తలపై కొట్టి ఓడించారు’ అని అన్నారు. కర్ణాటక ఎన్నికలను కేంద్రీకృతం చేయాలని భావించిన బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదని భూపేష్ బఘేల్ విమర్శించారు. ఆ రాష్ట్ర ప్రజలు తమ తీర్పు ఇచ్చారని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక నాయకత్వం, నేతలు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లడంతో ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. ఒక కార్యకర్త హనుమంతుడి వేషధారణలో సందడి చేశాడు. బజరంగ్‌బలి తమ పార్టీతో ఉన్నారని, బీజేపీని ఆయన శిక్షించారంటూ నినాదాలు చేశాడు. మరోవైపు కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేసే బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి గ్రూప్‌లను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
बजरंगबली जी के गदा का कड़ा प्रहार
भ्रष्टाचारी भाजपा की हो रही हारभ्रष्टाचार और नफ़रत के खिलाफ छत्तीसगढ़, मध्यप्रदेश, राजस्थान से शुरू हुए संदेश को हिमाचल के बाद अब कर्नाटक ने स्वीकार करते हुए देश को रास्ता दिखाया है.
2024 में भारत जुड़ेगा, नफ़रत हारेगी.#भाजपा_मतलब_भ्रष्टाचार
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 13, 2023
#WATCH | BJP made Bajrang Dal Bajrang Bali but Bajrang Bali is Bajrang Bali. Bajrang Bali always supports truth, love, and brotherhood. 'Aaj Bhrastachariyo ke ser pe gada pada hai'. This defeat is PM Modi's defeat: Chhattisgarh CM Bhupesh Baghel #KarnatakaResults pic.twitter.com/6wJocCzyN7
— ANI (@ANI) May 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

