pslv-c56| 30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం.. నింగిలోకి ఏడు ఉపగ్రహాలు
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. సింగపూర్‌కి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నది.
pslv-c56| శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ను ప్రయోగిస్తున్నారు.
డీఎస్ ఎస్ఏఆర్తోపాటు టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్పరిమెంటల్ శాటిలైట్ ‘ఆర్కేడ్’, 3యూ నానోశాటిలైట్ ‘స్కూబ్-2’, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్ ‘నూలయన్’, గలాసియా-2, ఓఆర్బీ-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనున్నారు. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో ఇటీవలే చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CHANDRAYAN3
- ISRO
- pslv c56
- satilites
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

