బెంగళూరు, నవంబర్ 29: ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు అత్యున్నత ఫ్రెంచ్ పౌర గౌరవ పురస్కారం లభించింది. ఇస్రో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్గా పనిచేసిన ఆమె.. భారత్, ఫ్రాన్స్ మధ్య అంతరిక్ష సహకారంలో అందించిన విశేష సేవలకుగాను ఈ పురస్కారం అందించారు.
భారత్లోని ఫ్రాన్స్ రాయబారి థియరీ మథౌ మంగళవారం బెంగళూరులో ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు.