PSLV- C61 | పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య.. విశ్లేషించి చెబుతామన్న ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది.
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారు.
ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 మిషన్ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో స్టేజీలో మొదట మోటార్ సరిగానే స్టార్ట్ అయినప్పటికీ ఆ వెంటనే టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, అన్నీ విశ్లేషించాక పూర్తి వివరాలు చెబుతామని ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. మూడో దశ తర్వాత రాకెట్ సమస్య వచ్చిందన్నారు.
ప్రయోగంతో ప్రయోజనాలు..
ఇస్రోకు ఇది 101వ మిషన్. దీనిద్వారా తదుపరి తరం భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-09 (రిసాట్-1బి)ను పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఈ ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు. దీని జీవితకాలం ఐదేండ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయింబవళ్లూ ఇమేజింగ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఈఓఎస్-09 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఇది రీశాట్-1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఇది రిసోర్స్శాట్, కార్టోశాట్, రీశాట్-2బీ సిరీస్ ఉపగ్రహాల వలే డేటా సేకరించి భూమికి చేరవేయనుంది. 2022లో ప్రయోగించిన ఈఓఎస్-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఈఓఎస్-09ను రూపొందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

