న్యూఢిల్లీ, ఆగస్టు 15: అమెరికా, రష్యా పంపినట్టుగా నాలుగైదు రోజుల్లో చంద్రుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపాలంటే ‘ఇస్రో’కు శక్తివంతమైన రాకెట్లు కావాలి. ‘చంద్రయాన్-3’ రాకెట్లో వాడింది రసాయన ఇంధనం. అంగారకుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపాలంటే.. ‘చంద్రయాన్-3’లో వాడిన రాకెట్ సరిపోదు.
అంతరిక్షంలో సుదూరమైన గమ్యస్థానాల్ని చేరటం కోసం అణు ఇంధనంతో నడిచే రాకెట్ తయారీపై ఇస్రో దృష్టిసారించింది. దీనికి సంబంధించి ‘బాబా అణు పరిశోధన కేంద్రం’తో కలిసి ప్రయోగాలు చేస్తున్నామని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.