చంద్రుడిపై వాతావరణం ఉందా?
ఎంతో అందంగా..అద్భుతంగా కనిపించే చంద్రుడిపై వాతావరణం లేదు. దీనికి కారణం చంద్రుడికి బలమైన గురుత్వారణ శక్తి లేకపోవటమే. గాలి, ఇతర వాయువుల్ని తీసుకెళ్లి అక్కడ వదిలినా..దాన్ని పట్టి ఉంచేంత బలమైన గురుత్వాకర్షణ శక్తి చంద్రుడికి లేదు. చంద్రుడి చుట్టూ అత్యంత పలుచగా కొన్ని వాయువులున్నాయి.
న్యూఢిల్లీ, జూలై 30: ఎంతో అందంగా..అద్భుతంగా కనిపించే చంద్రుడిపై వాతావరణం లేదు. దీనికి కారణం చంద్రుడికి బలమైన గురుత్వారణ శక్తి లేకపోవటమే. గాలి, ఇతర వాయువుల్ని తీసుకెళ్లి అక్కడ వదిలినా..దాన్ని పట్టి ఉంచేంత బలమైన గురుత్వాకర్షణ శక్తి చంద్రుడికి లేదు. చంద్రుడి చుట్టూ అత్యంత పలుచగా కొన్ని వాయువులున్నాయి. దీనిని ‘ఎక్సోస్పియర్’గా పిలుస్తారు. భూ వాతావరణంతో చంద్రుడి వాతావరణాన్ని అసలు పోల్చలేం. చంద్రుడిపైకి మానవ సహిత యాత్రలు చేయాలంటే ముందుగా అక్కడి వాతావరణంపై కచ్చితమైన అవగాహన ఉండాల్సిందే. చంద్రుడిపై సౌర తుఫాన్లు, అతి నీలలోహిత కిరణాల (యూవీ) తాకిడి ఎక్కువగా ఉంటుంది.
అంతరిక్షం నుంచి భూమిపైకి కూడా సౌర తుఫాన్లు, యూవీ కిరణాలు వస్తాయి. అయితే వీటిని అడ్డుకునేందుకు భూమి చుట్టూ వాతావరణ వ్యవస్థ ఉంది. ఈనేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల్లో మార్పులు అనూహ్యంగా ఉంటాయి. పగటి వేళలో చంద్రుడి మధ్యరేఖపై సగటు ఉష్ణోగ్రతలు 121 డిగ్రీలకు చేరుకుంటాయి. రాత్రి వేళలలో మైనస్ 133 డిగ్రీల సెల్సీయస్కు పడిపోతాయి. సూర్యకాంతి పడని చోట మైనస్ 246 డిగ్రీల సెల్సీయస్ ఉందని నాసాకు చెందిన లూనార్ ఆర్బిటర్ పంపిన సమాచారం వెల్లడించింది. చంద్రుడి ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతాల్లో వందల కోట్ల సంవత్సరాల క్రితం గడ్డకట్టిపోయిన మంచు ఉందని, అది ఈనాటికీ ఆవిరి కాలేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- atmosphere
- ISRO-NASA
- Moon
- Space
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

