వాట్సాప్‌లో రైలు భోజనం
రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారి బెర్త్‌ల వద్దకే ఆహారాన్ని అందించనుంది.
రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారి బెర్త్‌ల వద్దకే ఆహారాన్ని అందించనుంది.
ఎలా బుక్ చేయాలి?
రెండు దశల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మొదటి దశలో ఈ-టికెట్ బుక్ చేసుకోగానే ప్రయాణికుడికి www.ecatering.irctc.co.in లింకుతో కూడిన వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా ట్రైను వెళ్లే రూట్లలోని స్టేషన్లలో ఉండే రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. బెర్త్‌ల వద్దకు ఐఆర్సీటీసీ ఈ ఆహారాన్ని అందిస్తుంది. ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
రెండో దశలో పూర్తిగా వాట్సాప్ ద్వారానే ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రయాణికులు 8750001323కు వాట్సాప్ చేస్తే ఏఐ ఆధారిత చాట్‌బోట్ రిైప్లె ఇస్తుంది. అందులోని ఆప్షన్లను ఎంపిక చేస్తూ కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
ఎంపిక చేసిన రైళ్లలో
ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో త్వరలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను బట్టి మరిన్ని రైళ్లలో ప్రారంభించాలని ఐఆర్సీటీసీ భావిస్తున్నది.
ఐఆర్సీటీసీ ఇప్పటికే ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ యాప్, www.catering.irctc.co.in వెబ్సైట్ ద్వారా రైళ్లలో ఈ-క్యాటరింగ్ సేవలు అందిస్తున్నది. ఇప్పటివరకు సగటున ప్రతిరోజు 50 వేల మీల్స్‌ను ప్రయాణికులకు అందజేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

