IRCTC Tour Package | పర్యాటక ప్రియులకు ఐఆర్సీటీసీ బంపర్ టూర్ ప్యాకేజీ
IRCTC Tour Package | మీరు పర్యాటక ప్రియులా!.. అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ మీకో బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలోని రాజస్థాన్‌లోని అజ్మీర్, బికనీర్, జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్‌ను సందర్శించేలా ప్యాకేజీని
IRCTC Tour Package | మీరు పర్యాటక ప్రియులా!.. అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ మీకో బంపర్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలోని రాజస్థాన్‌లోని అజ్మీర్, బికనీర్, జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్‌ను సందర్శించేలా ప్యాకేజీని ఐఆర్సీటీసీ రూపొందించింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ప్రదేశాలను వీక్షించేందుకు ఏటా పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. దేశంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో జైసల్మేర్ ఒకటి. ఈ నగరాన్ని థార్ ఎడారికి ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు కొనసాగనున్నది. అయితే, ప్యాకేజీ అంతా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించింది.

ప్యాకేజీ వివరాలు ఇవీ..
ఈ టూర్ ప్యాకేజీని ‘రాజస్థాన్ రెగాలియా’ పేరుతో తీసుకువచ్చింది. ప్యాకేజీ ఈ నెల అక్టోబర్ 19న కొచ్చి విమానాశ్రయం నుంచి ప్రారంభంకానున్నది. ప్రయాణంలో మీరు ఆహారం, పానియాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునే ఆహారం నుంచి బస చేసే హోటల్ వరకు అన్నీ ఏర్పాట్లను ఐఆర్సీటీసీ చేయనున్నది.
ఇక చార్జీల విషయానికి వస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.55,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.45,250, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.43,800 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. పూర్తి వివరాల కోసం.. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SEA24 లో సంప్రదించాలని ఐఆర్సీటీసీ కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

