IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేళ క్రికెట్ లవర్స్‌కు జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ.49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌తో ఒక రోజు వ్యాలిడిటీతో 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తిస్తుందని తెలిపింది.
ఎక్కువ డేటా కోరుకొనే వారి కోసం జియో 90 రోజుల వ్యాలిడిటీ, 150 జీబీ డేటాతో రూ.667 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీనికి రోజువారి పరిమితి ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి వాడుకోవచ్చు. మరో ప్లాన్ ఏమిటంటే.. రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు.
ఈ రెండు డేటా ప్యాక్‌లకు బేస్ ప్లాన్ ఉంటే మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కాకపోతే వాయిస్ కాలింగ్, ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు ఉండవు. కాగా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలు చూడటానికి వ్యూయర్స్‌కి జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.