Manipur | ఇంటిపై రాకెట్ దాడి.. ఇద్దరు చిన్నారులు మృతి.. మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత
Manipur : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన రాకెట్ దాడి కారణంగా ఇద్దరు చిన్నారులు మరణించగా, వారి తల్లి గాయపడింది.
Manipur : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన రాకెట్ దాడి కారణంగా ఇద్దరు చిన్నారులు మరణించగా, వారి తల్లి గాయపడింది. దీంతో ఘటన జరిగిన బిష్ణాపూర్ జిల్లాలో ఆందోళనలు చెలరేగాయి. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ బంద్ చేశారు. పలు చోట్ల కర్ఫ్యూ విధించారు. మణిపూర్‌లో కొన్నేళ్లుగా మైటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఉన్న సంగతి తెలిసిందే.
గతంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో బిష్ణాపూర్ జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలోని మోయిరంగ్ ప్రాంతంలోని ట్రోంగ్లాబి అవాంగ్ లైకై అనే గ్రామంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒక ఇంటిపై కొందరు దుండుగులు రాకెట్ దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు మరణించారు. వారి తల్లి గాయపడ్డారు. మృతుల్లో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల పాప ఉంది. ఈ దాడి ఘటనతో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దగ్గర్లోని ఆయిల్ ట్యాంకులు, ట్రక్కులు తగలబెట్టారు. ఆస్తులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలు అక్కడికి చేరుకుని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 19 వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలు మరింత చెలరేగకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తప్పుడు సమాచారం వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా బిష్ణాపూర్తోపాటు మరో నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనను మణిపూర్ సీఎం వై ఖేంచంద్ సింగ్ ఖండించారు. ఇంటిపై రాకెట్‌తో దాడి చేయడాన్ని తీవ్రవాద చర్యగా అభివర్ణించారు. మరోవైపు కుకీ తెగల వాళ్లే ఈ దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

