MANIPUR| మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు పాక్షికంగా పునరుద్ధరణ
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో దాదాపు రెండున్నర నెలల తర్వాత ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన ప్రభుత్వం.. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై మాత్రం నిషేధం కొనసాగించింది.
MANIPUR| న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో దాదాపు రెండున్నర నెలల తర్వాత ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన ప్రభుత్వం.. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై మాత్రం నిషేధం కొనసాగించింది. అలాగే సోషల్‌మీడియా వెబ్సైట్లనూ నిలిపివేశారు. వైఫై హాట్స్పాట్లకు అనుమతి లేదు. యూజర్లు వీపీఎన్ సాఫ్ట్వేర్లను తొలగించాలని, కొత్త వాటిని ఇన్స్టాల్ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో మే 3 నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ ఘటన పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తున్నది. మణిపూర్ అంశంపై ప్రభుత్వం చర్చ జరుపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల అలసత్వం వల్లే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

