Microplastics | వారానికో క్రెడిట్ కార్డ్ తింటున్నాం.. ప్లాస్టిక్‌తో నిండిపోతున్న మనుషుల శరీరాలు
ప్రతి మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డు తింటున్నాడట. అదేం పిచ్చిమాట! క్రెడిట్ కార్డు తినటమేమిటి? అని అనుకొంటున్నారా? మేం చెప్పేది నిజమే. ప్రతి మనిషి ప్రతి గంటకు 16.2 బిట్ల మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి పీలుస్తున్నాడట. ఈ లెక్కన వారంపాటు పీల్చే మైక్రో ప్లాస్టిక్‌ను కలిపితే ఒక క్రెడిట్ కార్డు తయారీకి సరిపడా ప్లాస్టిక్ అవుతుందట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తేల్చిన అంశమిది.
- ప్రతి గంటకు పీలుస్తున్న మైక్రో ప్లాస్టిక్ 16.2 బిట్లు
- తాజా అధ్యయనంలో వెల్లడి
Microplastics | న్యూఢిల్లీ, జూన్ 20: ప్రతి మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డు తింటున్నాడట. అదేం పిచ్చిమాట! క్రెడిట్ కార్డు తినటమేమిటి? అని అనుకొంటున్నారా? మేం చెప్పేది నిజమే. ప్రతి మనిషి ప్రతి గంటకు 16.2 బిట్ల మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి పీలుస్తున్నాడట. ఈ లెక్కన వారంపాటు పీల్చే మైక్రో ప్లాస్టిక్‌ను కలిపితే ఒక క్రెడిట్ కార్డు తయారీకి సరిపడా ప్లాస్టిక్ అవుతుందట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తేల్చిన అంశమిది. అంటే ఈ పాటికే మన శరీరం నిండా ప్లాస్టిక్ నిండిపోయిందని అర్థం.
మైక్రో ప్లాస్టిక్ అంటే ఏమిటి?
నేటి కాలంలో మనిషి నిత్యజీవితంలో వీడదీయలేని భాగంగా మారిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఒకటి. ఎప్పుడూ జేబులోనే ఉండే మొబైల్ దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల వరకు దాదాపు ప్రతిదీ ప్లాస్టికే. ఈ ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే అవి కొంచెం కొంచెం విచ్ఛిన్నమవుతుంటాయి. అలా విచ్ఛిన్నమైన ప్లాస్టిక్ ధూళి గాలిలో కలిసిపోతుంది. 5 మిల్లీమీటర్లకంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ పార్టికల్ (ధూళి)ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఇది మన కంటికి కనిపించదు. కానీ, మనం దాన్ని పీలుస్తూనే ఉంటాం. ‘భూమిపై నీరు, గాలి, మట్టిలో లక్షల టన్నుల మైక్రో ప్లాస్టిక్ ఉన్నది. అది రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. గాలిలో అయితే ఇంకా వేగంగా పెరుగుతున్నది. 2022లో తొలిసారి మనిషి అంతర్గత శ్వాస వ్యవస్థలో ఈ మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు. దీనివల్ల మనుషుల్లో తీవ్రమైన శ్వాసకోస సమస్యలు వస్తున్నాయి’ అని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన మొహమ్మద్ ఎస్ ఇస్లామ్ తెలిపారు.
శరీర విధ్వంసం
మనకు తెలియకుండా శరీరంలోకి ప్రవేశిస్తున్న ఈ మైక్రోప్లాస్టిక్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నామనే అంశంపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో అవగాహన లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం మనిషి శరీరాన్ని ధ్వంసం చేసే శక్తి ఈ మైక్రో ప్లాస్టిక్‌కు ఉన్నదని అంటున్నారు. శరీర నిర్మాణానికి మూలం, శక్తి కేంద్రాలైన జీవకణాలను మైక్రో ప్లాస్టిక్ దెబ్బతీస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. అనేక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదకర రసాయనాలను మన శరీరంలోకి మోసుకెళ్లే వాహకంగా కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ పనిచేస్తున్నదని చెప్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

