IndiGo Airlines | చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేతతో 550 విమానాలు రద్దుచేసిన ఇండిగో
మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం (Chennai Airport) నీటమునిగింది.
చెన్నై: మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం (Chennai Airport) నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం వర్షం తెరిపినివ్వడంతో రన్‌వేపై నిలిచిన నీటిని సిబ్బంది తొలగించారు. దీంతో విమానాల రాకపోకలను మధ్యాహ్నం నుంచి ప్రారంభించారు.
అయితే విమానాశ్రయాన్ని మూసివేయడంతో పెద్దఎత్తున విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) కూడా భారీగా తమ సర్వీసులను క్యాన్సల్ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై మీదుగా నడవాల్సిన 550 విమానాలను రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అయితే నేటి మధ్యాహ్నం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కాగా, తుఫాను ప్రభావంతో చెన్నపట్నంలో ఆదివారం రాత్రి నుంచి వర్షం దంచికొడుతున్నది. దీంతో చెన్నై మహానగరానికి వెళ్లాల్సిన విమానాలు, రైళ్లు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

