న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెవీ వాటర్ టార్పిడో(Heavy Weight Torpedo)ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. సముద్ర గర్భంలో భారతీయ నేవీ ఈ పరీక్షను చేపట్టింది. అయితే టార్గెట్ను ఆ టార్పిడో ధ్వంసం చేసినట్లు నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ నౌకాదళంలో ఇది సరికొత్త మైలురాయి అని పేర్కొన్నది. అండర్వాటర్ యుద్ధ కార్యకలాల్లో భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకున్నట్లు నేవీ వెల్లడించింది. హెవీ వెయిట్ టార్పిడో పరీక్షకు చెందిన వీడియో ఇదే.
Successful engagement of an Underwater Target by an indigenously developed Heavy Weight Torpedo is a significant milestone in #IndianNavy's & @DRDO_India's quest for accurate delivery of ordnance on target in the underwater domain. #AatmaNirbharBharat@DefenceMinIndia pic.twitter.com/ZMSvtFSobE
— SpokespersonNavy (@indiannavy) June 6, 2023