S Jaishankar | ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదు.. దృఢంగా వ్యవహరిస్తాం: జైశంకర్
S Jaishankar | ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావించారు. అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి భారత్, పాకిస్థాన్ ఒక అవగాహనకు వచ్చాయని ఎస్ జైశంకర్ తెలిపారు. అలాగే ఉగ్రవాదంపై వైఖరికి భారత్ రాజీపడబోదని అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ దేశాలు కాల్పుల విమరణ, సైనిక చర్యపై ఒక అవగాహన కుదుర్చుకున్నాయి. అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన, రాజీలేని వైఖరిని భారత్ నిరంతరం కొనసాగిస్తుంది. ఇది అలాగే కొనసాగుతుంది’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యల వల్ల గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే పాక్ మిలిటరీ సంప్రదింపుల కారణంగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు.
India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.
India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

