Rice | ముంబై: దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
గత ఏడాదితో పోలిస్తే గోధుమ ఉత్పత్తిలో మాత్రం 1.3 శాతం పెరుగుదల కనిపిస్తుందని అంచనా వేసింది. గతేడాది 110.6 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి కాగా.. ఈ ఏడాది 112 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉన్నదని నిపుణులు అంటున్నారు.