పోస్టల్ పిన్‌కోడ్‌కు 50 ఏండ్లు.. అంకెల విశిష్టత తెలుసా..!
Pin code | ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్, శాటిలైట్ టెలివిజన్లు అందుబాదులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్, శాటిలైట్ టెలివిజన్లు అందుబాదులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చీమచిటుక్కుమన్నా క్షణాల్లోనే జనబాహుళ్యంలోకి వెళ్తున్నది. అయితే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానిరోజుల్లో ఉత్తరం ఒక వెలుగువెలిగింది. మంచికైనా.. చెడుకైనా అంతరంగాన్ని వ్యక్తంచేయడానికి ఉత్తరమే వేదికైంది. అలాంటి ఉత్తరం మనం పంపిన చిరునామాకు చేరాలంటే ప్రధానంగా ఉండాల్సింది పిన్‌కోడ్. ఆ ఆరంకెల సంఖ్య ఆధారంగానే ఉత్తరాన్ని పోస్టుమ్యాన్ బట్వాడా చేస్తాడు. పోస్టల్ విధానంలో అంతటి ప్రాధాన్యమున్న పిన్‌కోడ్ నేటితో 50 ఏండ్లు పూర్తిచేసుకుంటున్నది.

పోస్టల్ శాఖలో పిన్‌కోడ్ వ్యవస్థ 1972, ఆగస్టు 15న ప్రారంభమైంది. అప్పటి కేంద్ర సమాచార ప్రసార శాఖ అదనపు కార్యదర్శి శ్రీరామ్ భికాజి వెలాంకర్ పిన్‌కోడ్ నంబర్‌ను ప్రవేశపెట్టారు. ఆరంకెలు ఉండే పిన్‌కోడ్ సహాయంతో ఉత్తరాలను పంపిణీ చేస్తారు. ఇందులో ఒక్కో అంకె ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుంది.

మొదటి అంకె తపాలా కార్యాలయం గల ‘ప్రాంతాన్ని’, రెండో అంకె ‘ఉప-ప్రాంతాన్ని’, మూడో అంకె ‘జిల్లాను’, ఆఖరి మూడు అంకెలు ‘వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను’ సూచిస్తాయి. పోస్టల్ సర్వీసులను సులభంగా నిర్వహించడానికి దేశం మొత్తాన్ని 23 పోస్టల్ సర్కిళ్లుగా విభజించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

