7 న పాకిస్థాన్ సరిహద్దులో భారత ‘వాయుశక్తి యుక్తి’ విన్యాసాలు
ఈ నెల 7 న జరిపే ఈ భారీ సైనిక డ్రిల్‌లో 148 యుద్ధవిమానాలు పాల్గొననున్నాయి. రాఫెల్, తేజస్, సుఖోయ్-30.. మూడు రకాల జెట్లతో 'ట్రాన్స్ఫార్మర్ ఏరోబాటిక్ డిస్ప్లే' నిర్వహిస్తున్నారు. వీటితోపాటు చినూక్, ఎంఐ17వీ5,...
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధవిమానాలను గర్జించేందుకు భారత వైమానికదళం సిద్ధమవుతున్నది. వాయుశక్తి యుక్తి-2022 పేరిట నిర్వహిస్తున్న ఈ నెల 7 న జరిపే ఈ భారీ సైనిక డ్రిల్‌లో 148 యుద్ధవిమానాలు పాల్గొననున్నాయి. రాఫెల్ ఫైటర్లు కూడా పాల్గొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జైసల్మేర్‌లోని పోఖ్రాన్ వద్ద జరగనున్న ఈ సైనిక డ్రిల్‌కు ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు.
75 ఫార్మేషన్స్‌లో 17 జాగ్వార్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కార్యక్రమం ప్రారంభమవుతుందని భారత వైమానికదళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాఫెల్, తేజస్, సుఖోయ్-30.. మూడు రకాల జెట్లతో ‘ట్రాన్స్ఫార్మర్ ఏరోబాటిక్ డిస్ప్లే’ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు చినూక్, ఎంఐ17వీ5, ఎంఐ35, ఎల్సీహెచ్ వంటి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు కూడా ఈ వ్యాయామంలో పాల్గొంటాయి. భారత వైమానిక దళం తన సంసిద్ధతను ప్రదర్శించేందుకు ప్రతి మూడేండ్లకోసారి వాయుశక్తి డ్రిల్ నిర్వహిస్తుంది. 2019లో చివరిసారిగా డ్రిల్ జరిగింది.
సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. ఆకాష్ క్షిపణి వ్యవస్థ, స్పైడర్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా ఈ డ్రిల్‌లో ప్రదర్శించనున్నారు. సీ-17, సీ-130 జే రవాణా విమానాలు కూడా ఈ ఎక్సర్‌సైజులో భాగం కానున్నాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

