Filter Coffee | కోల్‌కతా, మార్చి 7: పొద్దుపొద్దునే గ్లాసెడు కాఫీ తాగనిదే ఏమీ తోచదు మనవాళ్లకు. అంతగా మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో రెండో ర్యాంక్ దక్కింది. కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. ఫుడ్ అండ్ ్ర టావెల్ గైడ్ ప్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నది.
మొదటి ప్లేస్‌లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. ఇండియాలో మరీ ముఖ్యంగా సౌతిండియాలో ఫిల్టర్ కాఫీకి ఉన్న డిమాండే వేరు. మూడు, నాలుగు స్థానాల్లో గ్రీస్‌కు చెందిన రెండు రకాల కాఫీలు నిలువగా.. ఇటలీకి చెందిన క్యాపచినో ఐదో స్థానంలో, తుర్కియేకు చెందిన టర్కిష్ కాఫీ ఆరోస్థానంలో, ఇటలీకే చెందిన కాఫీ రిస్ట్రెట్టో 7వ స్థానంలో, గ్రీస్‌కు చెందిన ఇంకో రకం ఫ్రాప్పె 8వ స్థానంలో, జర్మనీకి చెందిన ఐస్కాపీ 9వ స్థానంలో నిలువగా.. చివరిగా పదో స్థానంలో వియత్నాంకు చెందిన వియత్నామీస్ ఐస్డ్ కాఫీ నిలిచింది.